Harish Rao

Harish Rao: కవిత వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు..

Harish Rao: గడిచిన కొద్దీ రోజుల నుండి తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. బీఆర్ఎస్‌లో అంతర్గత పరిణామాలు వేడెక్కుతున్న వేళ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్  రావు, కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. లండన్ పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు, శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

“నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజలకు ఓ తెరిచిన పుస్తకం లాంటిది. క్రమశిక్షణ గల కార్యకర్తగా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నా పాత్ర అందరికీ తెలుసు. గత కొంతకాలంగా కొన్ని పార్టీలు చేస్తున్న విమర్శలనే కవిత పునరావృతం చేశారు. ఆమె వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా,” అని హరీష్ స్పష్టం చేశారు.

హరీష్ రావు మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. కేసీఆర్ కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజల పక్కన నిలిచి, తెలంగాణను ద్రోహుల చేతుల్లోంచి కాపాడుకోవడం మా బాధ్యత. మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాడిన వాళ్లం. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తాం,” అని హరీష్ ధృవీకరించారు.

ఇది కూడా చదవండి: Viral News: లా చదువుతున్న.. లా మీద నమ్మకం లేదు.. 26 సార్లు చెంపదెబ్బలు కొట్టిన యువతీ..

బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాల దుమారం

ఇటీవల బీఆర్ఎస్ నేత కవిత పార్టీ వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలతో పాటు సంతోష్ రావు కుట్రలపై ఆమె వ్యాఖ్యలు మరింత వివాదం రేపాయి. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ కవితను సస్పెండ్ చేయగా, అనంతరం ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ సమయంలో హరీశ్  రావు లండన్ పర్యటనలో ఉండగా, రాష్ట్రానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై స్పందించారు. “ఎవరో అబద్ధాలు మాట్లాడితే అవి నిజాలు కావు. తెలంగాణ ఉద్యమంలో నా కృషి ప్రజలకు తెలిసిందే. ప్రజల కష్టాలను తొలగించేందుకు మేము బలమైన ప్రతిపక్షంగా నిలుస్తాం. ప్రజల నమ్మకం తిరిగి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తుంది,” అని హరీశ్  నమ్మకం వ్యక్తం చేశారు.

ALSO READ  Telangana Cabinet: తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం.. ఏర్పాట్ల‌ను వేగ‌వంతం చేసిన స‌ర్కార్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *