Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు.. హరీష్ రావు పీఏ అరెస్ట్ !

Phone Tapping Case: ఎట్టకేలకు చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తు వేగవంతమవ్వడంతో ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు ఉన్నారు.

సిద్దిపేట్‌కు చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్‌పై గతేడాది పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, స్వల్ప ఊరట మాత్రమే లభించినా కేసు కొట్టివేయలేదు. తాజాగా, హరీష్ రావు పీఏ వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరిచారు. వారికి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు.

వంశీకృష్ణ గతంలో నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్‌గా పనిచేసి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం 2023లో హరీష్ రావు పేషీలో ఉద్యోగిగా చేరాడు. అక్కడే అతని పరిచయం భవానీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు సంతోష్ కుమార్, కారు డ్రైవర్ పరశురాములతో ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Chittoor District: తాగేందుకు డబ్బులు ఇవ్వనందుకు భార్యను హత్య

ఈ ముగ్గురు కలిసి మరణించిన వ్యక్తి గుర్తింపు కార్డు, సిమ్ కార్డులను ఉపయోగించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఈ నెంబర్ ద్వారా చక్రధర్ గౌడ్‌కు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడి, డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటయ్యాక, చక్రధర్ గౌడ్ ఈ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో, నిందితుల కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు, ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావులు ప్రధాన నిందితులుగా ఉన్నట్లు సమాచారం. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అనేక మలుపులు తిరగనుందా? అన్నది చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *