Harish Rao: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాలనపై, బీసీ బిల్లు అమలుపై, ఢిల్లీలో బీసీ పోరాటంపై ఆయన ఈ కీలక వ్యాఖ్యలను చేశారు.
Harish Rao: ఆరు గ్యారెంటీల అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇప్పటివరకూ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పేదల భూములను లాక్కుంటుందని మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం ఉన్న భూములను పక్కన పెట్టి మరో 12 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
Harish Rao: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ మేరకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి కనీసం ఆయన పార్టీ నేత అయిన రాహుల్‌గాంధీనే ఒప్పించలేకపోయారని విమర్శించారు. బీసీల మహా ధర్నాకు కనీసం రాహుల్‌గాంధీని ఒప్పించి తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. రాహుల్‌ను ఒప్పించలేని రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారని ప్రశ్నించారు.