Harish Rao:

Harish Rao: తెలంగాణ ప్రాంతీయుడే ద్రోహం చేస్తుండు.. హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Harish Rao: తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడే తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం త‌ల‌పెడుతున్నాడ‌ని బీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష ఉప నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ‌కు తెలంగాణ‌కు జ‌ల‌ద్రోహం జ‌రుగుతున్నద‌ని ఆరోపించారు. ఒక‌వేళ తెలంగాన‌కు జ‌లద్రోహం జ‌రిగితే తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రో ఉద్య‌మానికి సిద్ధం కావాల‌ని శుక్ర‌వారం (జ‌న‌వ‌రి 30) మీడియాతో మాట్లాడుతూ పిలుపునిచ్చారు.

Harish Rao: గోదావ‌రి జ‌ల‌ద్రోహం విష‌యంలో క‌త్తి ఏపీ సీఎం చంద్ర‌బాబుద‌ని, పొడిచేది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అని హ‌రీశ్‌రావు ఆరోపించారు. పోల‌వ‌రం- నల్ల‌మ‌ల‌సాగ‌ర్ విష‌యంలో మొద‌టి నుంచి రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం.. ఏపీ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తూ వ‌స్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. ఈ విషయంలో ప‌లుమార్లు ఒక ప్ర‌తిప‌క్షంగా తాము హెచ్చ‌రిస్తున్నా రేవంత్‌రెడ్డి పెడ‌చెవిన పెడుతూ వ‌చ్చార‌ని చెప్పారు.

Harish Rao: ఈ రోజు (జ‌న‌వ‌రి 30) జ‌రుగుతున్న జ‌ల‌వివాదాల స‌మావేశాల‌కు ఆదిత్య‌నాథ్ దాస్‌ను తెలంగాణ త‌ర‌ఫున పంపుతున్నార‌ని హ‌రీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణలోని అనేక ప్రాజెక్టుల‌ను అడ్డుకొని, వాటిపై పిటిషన్లు వేసిన ఆదిత్య‌నాథ్ దాస్‌ను జ‌ల‌వివాదాల స‌మావేశాల‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎలా పంపుతార‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

Harish Rao: న‌ర‌న‌రాన తెలంగాణ వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్న వ్య‌క్తి ఆదిత్య‌నాథ్ దాస్ అని హ‌రీశ్‌రావు ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. అలాంటి వ్య‌క్తిని ఢిల్లీలో జ‌రిగే స‌మావేశాల‌కు పంపితే ఎలా అర్థం చేసుకోవాల‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌కు అన్యాయం చేయ‌డానికే రేవంత్‌రెడ్డి ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడ‌ని ఆరోపించారు.

Harish Rao: కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ‌లో 2 కోట్ల 20 లోల ఎక‌రాల మాగాణి సాగు చేశార‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే చెప్పింద‌ని హ‌రీశ్‌రావు చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల, మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కం అమ‌లు వ‌ల్ల 32 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టును బీఆర్ఎస్ సాధించింద‌ని, అందుకే తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింద‌ని వివ‌రించారు.

Harish Rao: ఇప్ప‌టికైనా త‌మపై నోరు పారేసుకునే కేంద్ర మంత్రులు బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డి నోరు మూస్తే మంచిద‌ని హరీశ్‌రావు హిత‌వు ప‌లికారు. సాగునీటి జ‌లాల‌పై తాము ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేస్తున్న ద్రోహంపై ఎండ‌గ‌ట్టాన‌ని తెలిపారు. ఆ త‌ర్వాతే నిద్ర‌లేచిన రాష్ట్ర స‌ర్కార్‌.. కేంద్రానికి లేఖ రాసింద‌ని గుర్తు చేశారు.

Harish Rao: కేంద్రానికి రాసిన ఆ లేఖ‌లోఒకటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు డీపీఆర్ త‌యారీ ఆపాల‌ని, మ‌రొక‌టి కేంద్ర ప్ర‌భుత్వం సీడ‌బ్ల్యూసీలో న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను నిలిపేయాల‌ని రెండు నిబంధ‌న‌లు పెట్టింద‌ని తెలిపారు. ఆ రెండు నిబంధ‌న‌ల‌పై ఢిల్లీలో జ‌రిగే స‌మావేశానికి వ‌స్తామ‌ని అప్పుడే తెలంగాణ ప్ర‌భుత్వం లేఖ రాసింద‌ని తెలిపారు. ఆ నిబంధ‌న‌ల‌కు ఒప్పుకున్నారా? లేదంటే ఇప్పుడు ఢిల్లీలో మీటింగ్‌కు ఎందుకు వెళ్తున్నార‌ని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *