Harish Rao: బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం (జూలై 8)న మరోసారి కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఓ సారి హాజరైన ఆయన పలు అంశాలను ఘోష్ కమిషన్ ఎదుట ఉంచారు. క్యాబినెట్ ఆమోదం మేరకే కాళేశ్వర్యం ప్రాజెక్టు పనులను చేపట్టామని గతంలో ఆయన కమిషన్‌కు వివరించారు.
Harish Rao: మరోసారి విచారణకు రావాల్సిందిగా హరీశ్‌రావుకు కమిషన్ తాజాగా నోటీసులను పంపింది. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడానికి గల కారణాలను గతంలోనే వివరించినట్టు హరీశ్‌రావు ఆనాడే చెప్పారు. వ్యాప్‌కోస సూచన మేరకు, సీడబ్ల్యూసీ నివేదిక మేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోని కారణంగా ఆనాడు బ్యారేజీ ప్రాంతాన్ని మార్చామని కమిషన్‌కు తెలిపినట్టు గతంలోనే చెప్పారు.
Harish Rao: తాజాగా లోతైన విచారణ కోసం ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావును విచారణకు కాళేశ్వరం కమిషన్ పిలిచి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీశ్‌రావు విచారణ కమిషన్ ఎదుట గత నెలలో హాజరయ్యారు. ఆ సమయంలో క్యాబినెట్ ఆమోదం మేరకే కాళేశ్వరం చేపట్టినట్టు ఆ ముగ్గురూ తెలిపారు.
ఆ ముగ్గురి విచారణ అనంతరం అసెంబ్లీ సమావేశాల మినిట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్‌కు అప్పగించింది. ఆ మినిట్స్ సమగ్రంగా అధ్యయనం చేసిన కమిషన్.. ఆ మినిట్స్ ఆధారంగా హరీశ్‌రావును విచారించే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.