harish rao

Harish Rao: 237 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Harish Rao: 237 మందికి 54 లక్షల 57 వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు సిద్దిపేటలో 10,000 కుటుంబాలకు 35 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ సాయం అందించాము. వివిధ సందర్భాల్లో పేదలకు ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ సహాయాన్ని అందించాము. పదివేల మంది కుటుంబాలకు ఈ సహాయం అందిందని చెప్పుకోవడం గర్వంగా ఉంది. పదవ తరగతి చదువుల్లో మంచి ఫలితాలు రావాలని సొంత డబ్బుతో విద్యార్థులకు టిఫిన్ పెట్టించి స్టడీ మెటీరియల్ అందించి రాష్ట్రంలో సిద్దిపేట పదవ తరగతి ఫలితాలు అగ్రగామిగా నిలిపాము. అదే విధంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఎంతోమంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించగలిగాము. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా బీఫార్మసీ కాలేజీని సిద్దిపేటకి తీసుకువచ్చి ఇక్కడ విద్యార్థులకు బీఫార్మసీ విద్యను అందించాము. సత్య సాయి బాబా ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్స చేసే ఆసుపత్రిని తీసుకొచ్చాము.

Harish Rao: సిద్దిపేటకు గోదావరి జలాలను, రైల్వే లైన్ తీసుకువచ్చి దశాబ్దాల కలను నెరవేర్చుకున్నాం.  కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సిద్దిపేటకు తీసుకువచ్చి వానకాలంలో లక్ష ఎకరాలకు, యాసంగిలో లక్షకురాలకు సాగునీటిని అందించాము.పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని సిద్దిపేటలో పెట్టించి పామాయిల్ సాగును కూడా ప్రోత్సహించాము. ఇప్పుడొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసి కేసీఆర్ మర్చిపోయేలాగా చేస్తానని చెబుతున్నాడు. ఈ భూమి ఉన్నంతకాలం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోరు. ఈ రోజు ముఖ్యమంత్రి పుట్టిన రోజు యాదగిరిగుట్ట దేవాలయంలో జరుపుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: KTR: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Harish Rao: కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పి కేసీఆర్ కట్టిన యాదాద్రి లోనే నీ పుట్టినరోజు చేసుకున్నావు. చివరికి మూసి సుందరీకరణలో భాగంగా మంచినీళ్లను కూడా కేసీఆర్ కట్టిన కాలేశ్వరం నుండి మూసికి తరలించుతామని చెప్పాడు. అసలు కేసీఆర్ ఏ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? 11 నెలల పరిపాలనలో పేదవాళ్లకు ఒక్క ఇల్లు అయినా కట్టించావా రేవంత్ రెడ్డి? కూలగొట్టడం తప్ప కట్టే విధానం కాదు నీది. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు పడక ముందే రైతుబంధు పడేది. ఇప్పుడు పంట చేతికి వచ్చినా రైతుబంధు రాలేదు. కేసీఆర్ బతుకమ్మ పండుగ వచ్చినా, రంజాన్ పండగ వచ్చినా, క్రిస్మస్ పండగ వచ్చినా పండుగకు కొత్త చీర కట్టుకోవాలని చీరలు పంపిణీ చేసేవాడు. రెండు చీరలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒక్క చీర కూడా ఇవ్వలేదు. మూడుసార్లు రైతుబంధు ఇస్తానని ఒక్కసారి కూడా ఇవ్వలేదు. రెండు చీరలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఒక్క చీర కూడా ఇవ్వలేదు. అవ్వ తాతలకు  4,000 పెన్షన్ ఇస్తానని ఉన్న 2,000 పెన్షన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టాడు. ఏప్రిల్‌లో, ఆగస్టులో రెండు నెలల పెన్షన్‌ని రేవంత్ రెడ్డి సర్కారు ఎగ్గొట్టింది. కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగు రోజుల్లో పంట కొనుగోలు జరిగేది, రెండు రోజులకే రైతుల ఎకౌంట్లో కొనుగోలు డబ్బులు వచ్చేవి అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు.

Harish Rao: కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసినందుకు మోసం చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో 15 రోజుల్లో నాలుగు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన ఫుడ్ పాయిజన్‌తో 90 మంది పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు. ఇద్దరు పిల్లలు వెంటిలేటర్‌లో ఉన్నారు, డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువుకునే హాస్టల్లో పిల్లలకు కనీసం కడుపునిండా అన్నం పెట్టలేని పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వం దిగజారింది. ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే నెలరోజుల్లో నాలుగు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను ప్రేమతో పొందే స్థానంలో రేవంత్ రెడ్డి లేడు, కానీ పోలీసులను పంపించి బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడేది లేదు. నువ్వు ఇచ్చిన హామీల అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. నీ చేత హామీలను అమలు చేయిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *