Harish Rao: కృష్ణ నీటిపై వార్.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

Harish Rao: తెలంగాణకు చెందాల్సిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ నిర్బంధంగా తరలించుకుంటుండటం దారుణమని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అయితే, దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం అన్యాయం అని తీవ్రంగా విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మూడునెలలుగా నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా ఏపీ రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని తరలించుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. వాటర్ ఇయర్‌లోనే ఏపీ 646 టీఎంసీలు తీసుకుపోతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉండగా, ఏపీ మాత్రం ఇష్టారాజ్యంగా నీటిని తరలించుకోవడం తెలంగాణ రైతులకు అన్యాయమని అన్నారు. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో తెలంగాణ తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ తీసుకుపోతున్నా, తెలంగాణ ప్రభుత్వం చీమకుట్టినట్టు కూడా స్పందించకపోవడం బాధకరమని విమర్శించారు.

ఏపీ దూకుడు – తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం0

శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగులు నిల్వలు లేకున్నా, పోతిరెడ్డిపాడు, సాగర్ కుడికాలువ ద్వారా ఏపీ నీటిని తరలిస్తూ మొండిగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు అన్నారు. ప్రతి ఏడాది కేఆర్ఎంబీ పరిధిలోని త్రిమెన్ కమిటీ ద్వారా నీటి వినియోగంపై సమావేశం జరగాలి, కానీ ఈ ఏడాది ఇప్పటివరకు సమావేశం పెట్టకపోవడం బోర్డు వ్యవహారం ఎంత అవ్యవస్థగా ఉందో అర్థమవుతోందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం బోర్డుపై ఒత్తిడి చేయడంలో విఫలమైందని, నీటి తరలింపును అడ్డుకోవడంలో పూర్తిగా మరీచికగా మారిందని విమర్శించారు. ఏపీ దూకుడు, తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు ఖాళీ కావడం అనేది తెలంగాణ రైతులకు తీరని నష్టం అని అన్నారు.

తెలంగాణ రైతుల ఆందోళన – ప్రభుత్వ నిర్లక్ష్యం

వేసవి కాలం పూర్తిగా మొదలవకముందే తెలంగాణ రైతులు నీళ్ల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు అని హరీశ్ రావు తెలిపారు. ఏపీ నీటి దోపిడిని ఇప్పటికైనా అడ్డుకోకపోతే, సాగర్ ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడుతుందని, సాగర్ నీటిమట్టం పడిపోతే హైదరాబాద్ తాగునీటి సమస్య తీవ్రమవుతుందని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, కృష్ణా బోర్డుపై ఒత్తిడి తీసుకురావాలని, ఏపీ నీటి దోపిడిని అడ్డు పెట్టాలని హరీశ్ రావుడిమాండ్ చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *