Harish Rao : బీఆర్ఎస్లో కీలక నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పార్టీ పట్ల తన నిబద్ధతను, కేసీఆర్‌పై తన భరోసాను మరోసారి స్పష్టంగా తెలియజేశారు.
హరీష్‌రావు పేర్కొంటూ, “కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా. నేను కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. ఆయన ఆదేశాలను శిరసావహిస్తా” అని అన్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలున్నాయన్న ప్రచారాలను ఖండిస్తూ, “బీఆర్ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవు” అని స్పష్టంచేశారు.
“కేసీఆర్ మాటే… హరీష్ బాట” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య పార్టీపై తన అంకితభావాన్ని చూపిస్తున్నది. పార్టీ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానని, గీత దాటి అడుగు వేయబోనని స్పష్టం చేశారు.