Harish Rao: రైతుల అప్పులు ముఖ్యమా? దావోస్ డప్పులు ముఖ్యమా?

Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి శత విధాలా పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు చేసిన ప్రయత్నాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని అన్నారు. “మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజీలు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని” హరీష్ రావు ఆరోపించారు. ముఖ్యమంత్రితో పాటు, “ఎప్పుడో అయిపోయిన దావోస్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?” అని ప్రశ్నించారు.

దావోస్ లో జరిగే ఎంఓయూలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని, ఎవరైనా ఓపెన్ టెండర్‌లో రావాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. “మీరు లక్షా 82 వేల కోట్ల పెట్టుబడుల గురించి గప్పాలు చెబుతున్నారు, మీరు చెప్పింది నిజమా?” అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.

“మీరు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజలు గమనించారు. మొత్తం డొల్ల ప్రచారం అని తేలిపోయింది” అని హరీష్ రావు అన్నారు.

అలాగే, రైతు భరోసా కోసం ఎంత అశతో, కొండంత ఆందోళనతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని “చిల్లర పంచాయతీ” అంటావా? అంటూ మండిపడ్డారు. “ఇంతక ముందు రైతు బంధును బిచ్చం అన్నారు. ఇప్పుడు రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్నారు. సంక్రాంతికి ఇచ్చే అనుకున్న దానిని ఇప్పుడు మార్చి 31 వరకు పెంచారు” అని హరీష్ రావు ఆరోపించారు.

“జర్నలిస్టులు అడిగితే, ‘ఇదేమిటి?’ అని ప్రశ్నించడానికి మీరు ‘చిల్లర పంచాయతీ’ అంటున్నారు. రైతుల అప్పుల ఆవేదనను పక్కన పెట్టి మీ ప్రచారం వినాలని కోరుకుంటున్నారా?” అని ధ్వనించారు.

“రైతుల అప్పులు ముఖ్యమా? దావోస్ డప్పులు ముఖ్యమా?” అంటూ వారు ప్రశ్నించారు. “మీ సెల్ఫ్ డబ్బుకు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది. ఇకనైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి” అని హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana: తెలంగాణ‌లో నిలిచిన‌ ప‌త్తి కొనుగోళ్లు.. రైతులు ల‌బోదిబో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *