Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి సిట్ నోటీసులపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల తనకు సిట్ నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు కూడా నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాము ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే తమపై సిట్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.
ఎన్ని నోటీసులు ఇచ్చినా తాము భయపడబోమని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ “అటెన్షన్ డైవర్షన్” ప్రయత్నాలకు తాము భయపడమని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
