Harish Rao: చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లకు గోదావరి నీళ్లు పంపిస్తున్నారు

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద పడావు పెట్టి, ఆ నీటిని ఏపీకి పంపిస్తున్నారంటూ ఆరోపించారు.

> “గోదావరి జలాలను చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లకు తరలిస్తున్నారు,” అని ఆయన విమర్శించారు.

హరీష్ రావు వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు:

రాష్ట్రంలో రెండేండ్లలో రెండు లక్షల పింఛన్లు రద్దయ్యాయి.

తులం బంగారం ఇస్తామన్నారు కానీ, ఇప్పటివరకు అమలు కాలేదు.

రూ.4,000 పింఛన్ హామీ కూడా నెరవేర్చలేదు.

గోదావరి నీరు సమృద్ధిగా ఉన్నా, రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.

కనెపల్లి పంపులను ప్రారంభిస్తే, అన్ని ప్రాజెక్టులు నిండతాయని అన్నారు.

“కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క చెరువు కూడా నిర్మించారా?” అని ప్రశ్నించారు.

మిషన్ కాకతీయ ద్వారా కేసీఆర్ హయాంలో చెరువులు పునరుద్ధరించారని గుర్తు చేశారు.

హల్దీ, మంజీరాలపై ఎనిమిది చెక్‌డ్యామ్‌లు నిర్మించామని చెప్పారు.

హత్నూర, వెల్దుర్తి మండలాలకు నీరు అందించామన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో బిల్లులు రాకపోవడంతో ధర్నా చేసినవారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు.

కోడిగుడ్ల టెండర్లలో గత రెండు సంవత్సరాలుగా గుత్తేదారుల ఎంపికపై ప్రభుత్వం వైఫల్యాన్ని చూపిందని విమర్శించారు.

పైసలు ఇచ్చాక హాస్టల్ వార్డెన్లపై ఏసీబీ దాడులు చేయడం అన్యాయమన్నారు.

కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసే పనులే చేశారని, అభివృద్ధి పరంగా ప్రభుత్వం శూన్యమని విమర్శించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *