Harihara Veeramallu: జనవరి 6న ‘హరిహర వీరమల్లు’ మూవీ కోసం పవన్ కళ్యాణ్ పాడిన పాట విడుదల కావాల్సి ఉంది. అయితే మరింత నిడివితో, మరింత క్వాలిటీతో ఆ పాటను అందించడం కోసం అదనపు సమయం అవసరమైందని, అందుకే 6వ తేదీ పాటను విడుదల చేయడం లేదని చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దాంతో కొత్త సంవత్సరం ప్రారంభంలో పవన్ పాట కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరికొందరైతే ఆ సినిమా నుండి వేరే ఇంకేదైనా పాట అయినా విడుదల చేయవచ్చుగా అని కోరారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సి ఉంది. దీనికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.