Hari Hara Veeramallu:

Hari Hara Veeramallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌పై వ‌చ్చిన అప్‌”డేట్‌”

Hari Hara Veeramallu: సినీ ప్రియులు ముఖ్యంగా ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డేట్ రానే వ‌చ్చింది. భారీ అంచ‌నాల‌తో నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు: పార్ట్‌-1 స్వోర్డ్ వ‌ర్సెస్ స్పిరిట్‌పై తాజా స‌మాచారం వచ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల తేదీని నిర్మాత‌లు నిర్ణ‌యించిన‌ట్టు ఆ స‌మాచారం.

Hari Hara Veeramallu: నిధి అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండగా, బాబీ డియోల్‌, నాజ‌ర్‌, న‌ర్గీస్ ఫక్రీ, అనుప‌మా ఖేర్‌, సుబ్బ‌రాజు, సునీల్‌, విక్ర‌మ్ జీత్ విర్క్‌, నోరా ఫ‌తేహి త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ హై బ‌డ్జెట్ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా 17వ శ‌తాబ్ద‌పు మొగ‌ల్ సామ్రాజ్యం నాటి నేప‌థ్యానికి వ్య‌తిరేకంగా రూపొందించిన‌ట్టు అర్థ‌మ‌వుతున్న‌ది.

Hari Hara Veeramallu: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాటోగ్రాఫ‌ర్‌గా మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ తోట త‌ర‌ణి ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌, ద‌ర్శ‌కులు నిర్ణ‌యించారు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఏ ద‌యాక‌ర్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, ఏఎం ర‌త్నం ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

Hari Hara Veeramallu: ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2025 జూలై 24న ప‌లు భార‌తీయ భాల‌లో ఈ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా విడుద‌ల కానున్న‌ది. ఈ మేర‌కు ఈ సినిమా ట్రైల‌ర్‌ను జూలై 3న విడుద‌ల చేయ‌డానికి మేకర్స్ ప్లాన్ చేసిన‌ట్టు తాజా స‌మాచారం సినీ స‌ర్కిళ్ల‌లో హ‌ల్ చేస్తున్న‌ది. ఈ విష‌యం ప‌వ‌న్ అభిమానుల్లో కేరింత‌లు కొట్టిస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *