Hari Hara Veeramallu: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం వాయిదాలతో అభిమానుల ఆతృతను పరీక్షిస్తోంది. 2022 జనవరి 1న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏకంగా 12 సార్లు వాయిదా పడి రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 29, అక్టోబర్ 3, 2023 జనవరి 30, దసరా, 2024 మార్చి, డిసెంబర్, 2025 జనవరి 26, మార్చి 28, మే 9, జూన్ 12 తేదీలు ఖరారైనా, షూటింగ్ ఆలస్యం, రాజకీయ ఒత్తిళ్లు, సాంకేతిక సమస్యలతో వాయిదాలు తప్పలేదు.
Also Read: AA22xA6: అల్లు అర్జున్ – అట్లీ ప్రాజెక్ట్.. హీరోయిన్‌గా ఈమె ఫిక్స్!
పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ కూడా షూటింగ్‌పై ప్రభావం చూపుతోంది. విడుదలైన పాటలు, టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. దర్శకుడు జ్యోతి కృష్ణ గత చిత్రాలు కూడా ఆకట్టుకోలేదు. దీంతో చిత్ర బిజినెస్ ఇంకా సెట్ కాలేదు. బయ్యర్లు ఆసక్తి చూపకపోవడంతో నిర్మాతలు సతమతమవుతున్నారు.
