Hari Hara Veera Mallu:

Hari Hara Veera Mallu: మ‌చిలీప‌ట్నంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఘ‌ర్ష‌ణ‌

Hari Hara Veera Mallu:ప‌వ‌న్‌క‌ల్యాన్ హీరోగా న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా ఫ్యాన్స్ మ‌ధ్యే ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది. ఏపీలోని మ‌చిలీప‌ట్నంలోని రేవ‌తి థియేట‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేస‌కున్న‌ది. సినిమా రిలీజ్ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి ప్రీమియ‌ర్ షోలు వేశారు. ప‌రిమితికి మించి అనుమతించ‌డంతో అర్ధ‌రాత్రి వేళ ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది.

Hari Hara Veera Mallu:ప‌రిమితికి మించి అభిమానులు త‌ర‌లిరావ‌డంతో వారిని పోలీసులు, థియేట‌ర్ సిబ్బంది క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు కిక్కిరిసి ఉండ‌టంతో ఒక‌రిని ఒక‌రు నెట్టుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకోవ‌డంతో థియేట‌ర్ ఎంట్ర‌న్స్ వ‌ద్ద గేటు గ్లాస్‌లు ధ్వంస‌మ‌య్యాయి. కొంద‌రు ఒక‌రికొక‌రు పిడిగుద్దులు త‌న్నుకున్నారు. దీంతో పోలీసులు లాఠీల‌కు ప‌నిచెప్పి అదుపులోకి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *