Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఫిలిం హరిహర వీరమల్లు స్టార్ట్ చేసిన దగ్గరినుండి ఎన్నో అవాంతరాలు.. డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో.. నిర్మాత ఏ.ఎమ్.రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు నెత్తినేసుకున్నాడు.. పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నా.. వీలుని బట్టి డేట్స్ అడ్జెస్ట్ చేసి.. మొత్తానికి షూట్ కంప్లీట్ చేశారు. ఇక రిలీజ్ విషయం మాత్రం అదిగో పులి, ఇదిగో మేక అన్నట్టు తయారైంది.. ఎట్టిపరిస్థితిలోనూ జూలై 24న థియేటర్లలో బొమ్మ పడడం పక్కా అని కన్ఫామ్ చేసేశారు. ట్రైలర్ కూడా మూవీ మీద అంచనాలు పెంచేసింది.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చెయ్యాలనేదాని గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు.. వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి.. వీలు చూసుకుని విజయవాడ లేదా తిరుపతిలో ఈనెల 20వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

