Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు సినిమాను ఎన్నో వాయిదాల తరువాత ఈ మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కు దాదాపు రావట్లేదు. ఇప్పటికి పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొంత మేర షూట్ పెండింగ్ ఉంది. మరికొద్దీ రోజుల్లో పవన్ షూట్ లో జయిన్ అవుతారు. ఈ పోర్షన్ షూట్ ఫినిష్ అయ్యేందుకు ఎలా చూసుకున్న కూడా నెల రోజులు పడుతుంది. ఆపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసేందుకు మరో నెల పడుతుంది. ఇక మళ్ళీ కొత్త రిలీజ్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారో తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం దర్శకత్వం వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
