Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: 29న ‘హరిహర వీరమల్లు’ బీటీఎస్ వీడియో!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం మార్చి 28న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ పాడిన ‘మాట వినాలి’ అనే పాటను ఇటీవల మేకర్స్ ఐదు భాషల్లో విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో బుధవారం ఈ పాటకు సంబంధించిన బీటీఎస్ వీడియోను విడుదల చేసేందుకు రంగం సిద్థం చేశారు. కీరవాణి స్వరాలు అందించిన ఈ పాటను పెంచల దాస్ రాయగా పవన్ కళ్యాణ్ పాడారు. బాబీ డియోల్ ఔరంగజేబుగా నటించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ నాయిక. క్రిష్ తో పాటు ఈ సినిమాను జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో దయాకర్ రావు దీనిని నిర్మిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kalki 2898 AD Part 2: కల్కి 2898 ఎడి పార్ట్ 2 హైస్పీడ్‌లో షూటింగ్.. దీపికా రూమర్స్‌కు ఫుల్‌స్టాప్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *