Hardik Pandya

Hardik Pandya: 17 పరుగులు చాలు… మరెవరూ సాధించలేని రికార్డు పాండ్యా సొంతం!

Hardik Pandya: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా 2025 ఆసియా కప్ ద్వారా భారత జట్టులోకి తిరిగి వస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో అతను అరుదైన రికార్డుకు చేరువులో ఉన్నాడు.

ఇప్పటికే 8 టీ20 ఆసియా కప్ మ్యాచ్‌ల్లో 83 పరుగులు చేసి 11 వికెట్లు తీసిన హార్దిక్, మరో 17 పరుగులు చేస్తే టీ20 ఆసియా కప్‌లో 100+ పరుగులు, 10+ వికెట్ల డబుల్ ఫీట్ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫీట్ హార్దిక్ ఆల్ రౌండ్ నైపుణ్యాలను నొక్కి చెబుతుంది. దీని ద్వారా 2026 టీ20 ప్రపంచ కప్ కోసం జట్టులో అతని స్థానాన్ని పదిలం చేస్తుంది.

UAE పిచ్‌లు సాధారణంగా స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇది ఫాస్ట్ బౌలర్లకు సవాలుతో కూడిన వాతావరణం. అయితే, హార్దిక్ స్లో బాల్స్, యార్కర్లు, బౌన్సర్లు వంటి వైవిధ్యాలు ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందికరంగా ఉంటాయి. భారత జట్టు జస్ప్రీత్ బుమ్రాతో పాటు హార్దిక్‌ను రెండవ ఫాస్ట్ బౌలర్‌గా ఉపయోగించవచ్చు. గాయం నుండి తిరిగి వచ్చిన తర్వాత భారత జట్టు యాజమాన్యం హార్దిక్ ఫిట్‌నెస్, బౌలింగ్ సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తుంది.

ఇది కూడా చదవండి: GHAATI Release Glimpse: యాక్షన్ తో చితకకొట్టినా అనుష్క..

భారత ఆసియా కప్ షెడ్యూల్
ఆసియా కప్ 2025 T20 టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి UAEలో ప్రారంభమవుతుంది.
భారత జట్టు గ్రూప్ దశ షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది:
సెప్టెంబర్ 10, 2025: భారత్ vs యుఏఈ (దుబాయ్)
సెప్టెంబర్ 14, 2025: భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)
సెప్టెంబర్ 19, 2025 : భారత్ vs ఒమన్ (షార్జా)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *