Harbhajan Singh

Harbhajan Singh: శ్రీశాంత్ ను చెంపదెబ్బ కొట్టడంపై హర్భజన్ సింగ్ సంచలన కామెంట్స్ !

Harbhajan Singh: 2008 ఐపీఎల్‌లో శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన సంఘటనకు సంబంధించి హర్భజన్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. తన జీవితంలో మార్చుకోవాలనుకునే ఒకే ఒక్క సంఘటన శ్రీశాంత్‌ను కొట్టిన సంఘటన అని పేర్కొన్నారు. ఆ సంఘటన తనను చాలా బాధించిందని, దానికి తాను 200 సార్లు క్షమాపణలు చెప్పానని తెలిపారు. చాలా సంవత్సరాల తర్వాత, శ్రీశాంత్ కుమార్తెను కలిసినప్పుడు, ఆమె తనతో ప్రేమగా మాట్లాడుతుంటే, ఆ చిన్నారి “నేను మీతో మాట్లాడను. మీరు మా నాన్నను కొట్టారు” అని అన్నదట. ఈ మాటలు తన హృదయాన్ని ముక్కలు చేశాయని, కన్నీళ్లు ఆగలేదని హర్భజన్ సింగ్ చెప్పారు. ఆ చిన్నారిపై తాను ఎలాంటి ముద్ర వేశానని ఆలోచించుకున్నానని, ఆమె తనను చెడుగా చూస్తుందని భావించానని తెలిపారు.

ఇది కూడా చదవండి: Crime News: బరితెగించింది.. ప్రియుడి కోసం సాంబారులో విషం కలిపి లేపేసింది!

ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని, ఆ అధ్యాయాన్ని తన జీవితం నుండి తొలగించాలని కోరుకుంటున్నానని హర్భజన్ సింగ్ వెల్లడించారు. ఆమె పెద్దయ్యాక తనను అదే విధంగా చూడకూడదని, తన మామగా ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆమెకు చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఈ సంఘటన హర్భజన్ సింగ్ జీవితంలో ఒక పెద్ద పశ్చాత్తాపంగా మిగిలిపోయింది. ఇప్పటికే చాలాసార్లు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు. “తప్పులు చేయడం సహజమే. కానీ, వాటిని పునరావృతం చేయకూడదు. అతడు నా సహచరుడు. మేమిద్దరం కలిసి మ్యాచులు ఆడాం. కానీ, ఆ మ్యాచ్‌లో మేం ప్రత్యర్థులం. ఏదైనా సరే ఆ స్థాయికి వెళ్లకుండా ఉండాల్సింది. కాస్త విజ్ఞతతో ప్రవర్తించి ఉంటే బాగుండేది. అందులో తప్పు నాదే. శ్రీశాంత్‌ కూడా నన్ను రెచ్చగొట్టాడు. అయినా సరే నేను అలా చేయాల్సింది కాదు. ఆ తర్వాత సారీ కూడా చెప్పా “ అని తెలిపాడు. అయితే, శ్రీశాంత్ కుమార్తె అలా ఎప్పుడు అనిందనే విషయాన్ని మాత్రం హర్భజన్‌ తెలపలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *