దేవదేవుని బ్రహ్మోత్సవ వేళ తిరుమల భక్త జన సంద్రంతో కిటకిట లాడుతోంది. మంగళవారం స్వామి వారు గరుడ వాహనంలో భక్తులకు అభయమిచ్చారు. పరమ పుణ్యమైన వాహన సేవగా భావించే గరుడ వాహన సేవ కోసం లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈరోజు అంటే బుధవారం అక్టోబర్ 9న ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో శ్రీదేవీ భూదేవీ సమేతుడై భక్తులకు దర్శనమిచ్చాడు . ఈ సందర్భంగా తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి . స్వామి వారిని హనుమంత వాహనంపై చూసేందుకు భక్తులు ఉత్సాహంగా ఎదురుచూశారు . గోవిందుని తోడ్కొని హనుమంత వాహనం తమ ముందు నుంచి వెళుతుంటే ఆ వైభవాన్ని చూసి భక్తులు పరవశించి పోయారు.
బ్రహ్మానందనాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహస్తున్నారు. జనం పోటెత్తడంతో తిరుమల కిక్కిరిసిపోయింది. ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తిరుమలలో భక్త జనసందోహం కింది ఫొటోల్లో చూడవచ్చు . .