Pakistan Coach Mike Hesson: మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని పాక్ కోచ్ మైక్ హెసన్ అన్నారు. వారి కోసం గ్రౌండ్‌లో తాము చాలాసేపు ఎదురుచూశామని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఈ మ్యాచులో తమ ప్రదర్శన కూడా ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు. కాగా నిన్న భారత ప్లేయర్స్ పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని విషయం తెలిసిందే. టాస్ టైమ్‌లోనూ పాక్ కెప్టెన్‌తో సూర్య చేతులు కలపలేదు. అయితే, దీనిపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెస్కేట్ స్పందిస్తూ, “ప్రతి జట్టుకు తమ ఆటగాళ్లపై సొంత అభిప్రాయాలు ఉండటం సహజం. వారు తమ ఆటగాళ్లకు ఎలాంటి ర్యాంక్ ఇచ్చుకున్నా అది వారి నిర్ణయం” అని అన్నారు.
అంతేకాకుండా, పాకిస్తాన్-భారత్ మధ్య జరిగిన ఉగ్రవాద దాడుల కారణంగానే భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదని స్పష్టం చేశారు. ఇక పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ 127/9 పరుగులు చేసింది. అనంతరం భారత్ వేగంగా ఆడి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31), సూర్యకుమార్ యాదవ్ 47*, తిలక్ వర్మ 31 రాణించారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 19న ఒమన్‌తో ఆడనుంది. ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌ను భారత్ చిత్తు చేసింది.
ఇది కూడా చదవండి: India-Pakistan: టీం ఇండియాకు జరిమానా తప్పదా?.. పాకిస్థాన్ ను గోరంగా అవమానించిన భారత జట్టు..!
మొదట పాక్‌తో మ్యాచ్ ఆడకూడదనే డిమాండ్ చేశారు. కానీ పోరు నుంచి తప్పుకోవడం కంటే పోరాడి మట్టి కరిపించడం మేలని అభిప్రాయపడిన వాళ్లూ ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమాధానంగా OP సిందూర్‌తో ఒకసారి, మైదానంలో ఇవాళ మరోసారి పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ఏదైనా దాయాదికి బుద్ధి చెప్పాల్సిందే అంటున్నారు.