హమాస్ గ్రూపు అధినేతను ఇజ్రాయెల్ దళాలు మొటికల్పాయి. అక్టోబరు 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వర్ ను హతమార్చారు.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హెర్జి హలేవి మాట్లాడుతూ..
“ఒక ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత, మా దళాలు హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు, అనేక మంది ఇజ్రాయెల్ పౌరుల ఊచకోత, కిడ్నాప్‌కు కారణమైన ప్రధాన వ్యక్తి అయిన యాహ్యా సిన్వర్‌ను అంతమొందించాయి. నిన్న గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో అతనిని అంతమొందించిన దళాన్ని నేను ఇప్పుడు కలుసుకున్నాను. అన్ని రంగాలలో పని చేస్తున్న ఐడీఎఫ్ దళాల ధైర్యం, సంకల్పం అతనిని అంతం చేసింది. మేము సిన్వార్‌ను చేరుకుంటామని చెప్పాం. ఇప్పుడు అది సాధించాం. అతను లేకుండా ప్రపంచం ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది” అని చెప్పారు.
కాగా, యాహ్యా సిన్వార్ ఇజ్రాయెల్‌లో 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న 2023 అక్టోబరులో జరిగిన భయానక దాడులకు ప్రధాన సూత్రధారి.

