GV Prakash: తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్ జీవి ప్రకాష్ గతేడాది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తన భార్య సింగర్ సైంధవితో విడాకులు తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే జివి ప్రకాష్ కు సంబంధించి ఓ న్యూస్ చెన్నై సిర్కిల్స్ వినిపిస్తుంది.
అతను హీరోగా నటించిన బ్యాచ్ లర్ సినిమాలోని హీరోయిన్ దివ్య భారతీతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడని వీరు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తల నేపథ్యంలో స్పందించిన జీవి రూమర్స్ ను ఖండించాడు.
Also Read: Akira Nandan: త్రివిక్రమ్ డైరెక్షన్ లో అకీరా నందన్.. నిజమెంత?
తాము కలిసి నటించినంత మాత్రాన తమ మధ్య ఎదో ఉందనుకోవడం పొరపాటని, తాము మంచి ఫ్రెండ్స్ అని, సినిమా షూట్ లో మాత్రమే కలుస్తామని, అంతకు మించి బయట ఎక్కడ కనీసం కలుసుకోమని చెప్పాడు. మొత్తానికి ఇవన్నీ అబద్దపు వార్తలని జీవీ ప్రకాష్ తేల్చేశాడు.