Kingston Movie: బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న జీవీ ప్రకాశ్ కుమార్ మంచి నటుడు కూడా. కొన్నేళ్ళుగా తన దైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. తాజాగా అతను ‘కింగ్ స్టన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఆవిష్కరించారు. కమల్ ప్రకాశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో దివ్య భారతీ, ఆంటోని, చేతన్, కుమార్ వేల్, సాబు మోహన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరో జీవీ ప్రకాశే సంగీతం అందిస్తున్నాడు. ఈ హారర్ అడ్వెంచర్ మూవీకి దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కు ఇది 25వ చిత్రం. దీనిని యూనివర్సల్ పిక్చర్స్ తో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ నెల 9న ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.