Guvvala Balaraju:బీఆర్ఎస్ పార్టీ వీడిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అందరూ ఊహించినట్టుగానే ఆ పార్టీలోకే వెళ్లనున్నారు. ఇప్పటికే ఊహించినట్టే బీజేపీలో ఆయన చేరికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును శుక్రవారం (ఆగస్టు 8) కలిశారు. తార్నాకలోని ఆయన నివాసంలో వారిద్దరూ భేటీ అయ్యారు.
Guvvala Balaraju:ఈ సందర్భంగా గువ్వల బాలరాజు చేరే తేదీ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు 11వ తేదీన బాలరాజు కాషాయ కండువాను కప్పుకునేందుకు తేదీ నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే గురువారమే తన అనుచరులతో సమావేశమైన ఆయన ఆ మరునాడే బీజేపీ అధ్యక్షుడిని కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.