సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలని ఖలిస్థాని ఏర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విమానాలు పేల్చేస్తానన్న పన్నూ.. ఇప్పుడేమో సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని బెదిరించాడు. భారత్‌లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశాడు.
‘‘భారత సీఆర్పీఎఫ్‌కు హోం మంత్రి అమిత్‌షా నాయకత్వం వహిస్తున్నారు. హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు ఆయనే కుట్ర పన్నారు. కిరాయి హంతకులను ఆయనే నియమించారు. న్యూయార్క్‌లో నా హత్యకు సైతం కుట్ర పన్నారు’’ అని ఆరోపణలు చేశాడు. ఖలిస్థానీ వేర్పాటువాదుల హత్యకు ప్రతీకారంగానే పేలుడు చేపట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పేలుడు క్లిప్ తో పాటు టెలిగ్రామ్ లో వీడియో వైరల్ గా మారింది. “భారత నిఘా ఏజెన్సీలు మమ్మల్ని అణచివేయలేదు. ఏ క్షణమైనా దాడి చేయగల సత్తా మా దగ్గర ఉంది. ఖలిస్థాన్ జిందాబాద్” అనే మెసేజ్ ని టెలిగ్రామ్ లో పోస్టు చేశారు.