Guntur:

Guntur: బాలిక‌కు డ్ర‌గ్స్ అల‌వాటు చేసి, అస‌భ్య‌క‌ర ఫొటోలు తీసి..

Guntur: ఇన్‌స్టా ప‌రిచ‌యాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఎంద‌రో ప్రాణాలు తీసుకోగా, మ‌రెన్నో కుటుంబాల్లో అల్ల‌క‌ల్లోలానికి దారితీస్తున్న‌ది. ఇక్క‌డా ఆ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసింది. తేరుకుంటుందో, మ‌రేదైనా ప్ర‌మాదం చోటుచేసుకుంటుందో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి ఆ కుటుంబంలో నెల‌కొన్న‌ది. ఇలాంటి ప‌రిస్థితి మ‌రో కుటుంబంలో జ‌ర‌గ‌కూడ‌ద‌ని ప‌లువురు మాన‌సిక విశ్లేష‌కులు కోరుకుంటున్నారు.

Guntur: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు ప‌ట్ట‌ణంలోని ఓ క‌ళాశాల‌లో ఓ బాలిక ఇంట‌ర్ మొదటి సంవ‌త్స‌రం చ‌దువుతున్న‌ది. అదే క‌ళాశాల‌లో చ‌దివే ఓ సీనియ‌ర్ విద్యార్థి ఆమెకు ఇన్‌స్టాలో ప‌రిచ‌యం అయ్యాడు. ఇద్దరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇదే స‌మ‌యంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఆ యువ‌కుడు న‌మ్మించాడు. ఈ స‌మ‌యంలో ఆమెకు తెలియ‌కుండానే ఆమెకు డ్ర‌గ్స్ అల‌వాటు చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆమెతో అస‌భ్యంగా తాను ప్ర‌వ‌ర్తించి వీడియోలు తీసుకున్నాడు.

Guntur: ఆ బాలిక కుటుంబ స‌భ్యుల‌కు అనుమానం వ‌చ్చి ఆమె ఫోన్‌ను ప‌రిశీలించ‌గా నిర్ఘాంత‌పోయారు. కళ్లు బైర్లు క‌మ్మేసినంత ప‌నైంది. ఓ యువ‌కుడితో త‌న కూతురు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను చూసి త‌ల్లి మందిలించింది. దీనికి ప్ర‌తిగా త‌ల్లిపైనే ఆ బాలిక దాడి చేసింది. పిచ్చిపిచ్చిగా ప్ర‌వ‌ర్తించసాగింది.

Guntur: ఎటూ తోయని ఆ మాతృమూర్తి మ‌న‌స్తాపానికి గురైంది. నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి య‌త్నించింది. ఈ స‌మ‌యంలో పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో రంగంలోకి దిగారు. డ్ర‌గ్స్ కోణంలో స‌మగ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురును డ్ర‌గ్స్ ముగ్గులోకి దించి, అస‌భ్య వీడియోలు, ఫొటోలు తీసి అల్ల‌రి చేసిన ఆ దుండ‌గుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని పోలీసుల‌ను ఆ కుటుంబంతోపాటు స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *