Gujarat

Gujarat: భర్తను చంపిన భార్య.. ఎందుకు అంటే..?

Gujarat: ఇది నిజమైన ప్రేమికురాలు. ఎంత గొప్ప ప్రేమికురాలు అంటే ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న వాడిని కోసేసింది. ఒకడిని ప్రేమించింది. ఇంకొకడిని పెళ్లాడింది. మరి కొందరితో కలిసి మొగుడిని చంపేసింది. ఎందుకు చంపావు అంటే…నాకు నా మొగుడి కంటే..నా లవర్ ఏ ఇష్టం అని సమాధానం చెప్పింది. ఇప్పుడు దొరికిపోయారు కదా…వెళ్లి ఆ శ్రీకృష్ణ జన్మ స్థానంలో కూర్చుని ..ఒకరి మోకాలు ఒకరు చూసుకోండి.

ఇటీవల రోజుల్లో భర్త బాధితుల కంటే భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఇతరుల మోజులో పడి కొందరు భార్యలు సొంత భర్త ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలంటి ఘటనలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం.. పెళ్లయి ఎన్ని రోజులు కాకుండానే భర్తను హతమార్చడం ఈ తరం ఫ్యాషన్ అయిపోయింది. అయితే తాజాగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కూడా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. 

ఇది కూడా చదవండి: Palnadu: తండ్రి ఆస్తి కోసం సోదరులను చంపిన చెల్లి

Gujarat: పాయల్ అనే మహిళకు భావిక్ అనే వ్యక్తితో ఇటీవల పెళ్లయింది. పాయల్‌కు ఇది వరకే ప్రేమికుడు ఉన్నాడు. పెళ్లికి ముందు వారి ప్రేమ విషయం ఇంట్లో చెబితే.. పెద్దలు అంగీకరించలేదు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పాయల్ తన ప్రేమికుడితో కలిసి పెద్ద కుట్ర పన్నింది. పెళ్లయిన నాలుగు రోజులు కాకుండానే తన భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. 

ఈ క్రమంలో తనని పికప్ చేసుకోమని పాయల్ భావిక్‌కి చెప్పింది. దీంతో భావిక్ తనని తీసుకురావడానికి వెళ్తుండగా.. కల్పేష్ తన కొంత మందితో కలిసి అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత భావిక్ గొంతు కోసేసి.. నర్మదా కాలువలో పడేశారు. ఇంటికి వస్తానని చెప్పిన భావిక్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

Gujarat: భార్య పాయల్‌పై అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చివరికి పాయల్ తన ప్రేమికుడు కల్పేష్‌తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు వీరిద్దరితో పాటు వారికి సాయం చేసిన సహచరులను కూడా అరెస్టు చేశారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇలా కొడుకు మరణించడంతో భావిక్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pakistan: కరాచీలో భయానక ఘటన: ఐదంతస్తుల భవనం కుప్పకూలి 27 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *