Viral Video

Viral Video: పాపం..రూ.20లకు 4 గే పానీపూరీలు ఇచ్చాడు.. రోడ్డెక్కిన మహిళా

Viral Video: వడోదర (గుజరాత్) నగరంలో ఓ మహిళ చేసిన నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రూ.20 చెలిస్తే  ఆరు పానీపూరీలు ఇస్తాను అని చెప్పారు కానీ ఆ మహిళకు నాలుగు మాత్రమే రావడంతో, తాను మిగిలిన రెండు పూరీలు తీసుకునే వరకు కదలనని పట్టుబట్టి నడిరోడ్డుపైనే బైఠాయించింది. ఈ సంఘటన సుర్‌సాగర్ సరస్సు సమీపంలో చోటు చేసుకుంది.

ఎలా జరిగింది ఈ సంఘటన?

పానీపూరీ బండి దగ్గరకి వెళ్లిన ఆ మహిళకు, బండి యజమాని రూ.20కి ఆరు పూరీలు ఇస్తానని చెప్పాడు. కానీ నాలుగు మాత్రమే ఇచ్చాడని ఆమె ఆగ్రహానికి గురైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో మహిళ రోడ్డు మధ్యలో కూర్చుని నిరసనకు దిగింది.

ట్రాఫిక్ జామ్ – పోలీసుల ఎంట్రీ

ఆమె బైఠాయించడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, స్థానికులు ఈ సన్నివేశాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఘటన వైరల్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

“నా హక్కు నాకు కావాలి” – మహిళ పట్టుదల

ఆమె మాత్రం కదలకుండా, “నేను చెల్లించిన డబ్బుకి ఆరు పానీపూరీలు రావాలి.. ఇది నా హక్కు” అంటూ పోలీసులకే డిమాండ్ చేసింది. ఏడుస్తూనే తనకు మిగిలిన పూరీలు ఇప్పించాలని పట్టుబట్టింది.

ఎట్టకేలకు ముగిసిన డ్రామా

చివరికి పోలీసులు ఆమెను రోడ్డుపై నుంచి పక్కకు తీసుకెళ్లడంతో ట్రాఫిక్ సమస్య సర్దుకుంది. అయితే ఆమెకు మిగిలిన రెండు పానీపూరీలు లభించాయో లేదో మాత్రం ఇంకా తెలియదు. 

నెటిజన్ల రియాక్షన్

ఈ వీడియో నెట్టింట వైరల్ అవడంతో నెటిజన్లు వింత కామెంట్లు చేస్తున్నారు. “పానీపూరీ అంటే ఇంత ప్రేమ ఉంటుందా?” అని కొందరు సరదాగా స్పందిస్తే, “ఇకపై పానీపూరీ కౌంట్ జాగ్రత్తగా చూసుకోవాలి” అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *