Gujarat: గుజరాత్ రాష్ట్రంలో వడోదర సమీపంలోని ఓ నదిపై వంతెన కూలిన ఘటనలో పది మంది వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. వాహనాలు వెళ్తుండగా, వంతెన కుప్పకూలడంతో వాహనాలు కూడా నదిలో పడిపోయాయి. ఆ వాహనాల్లో వెళ్లే వారిలో పది మంది చనిపోయారు.
Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర సమీపంలోని వడోదర-ఆనంద్ ప్రధాన రహదారిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిన ఘటనలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో రెండు లారీలు సహా నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన గురించి తెలియగానే అధికారులు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే తీవ్రగాయాలపాలైన పది మంది చనిపోగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నదని తెలుస్తున్నది.