Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో 32 ఏళ్ల వ్యక్తి తన కుటుంబానికి చెందిన డైమండ్ కంపెనీలో తన చేసే ఉద్యోగానికి అనర్హుడని నిరూపిడానికి. తన ఎడమ చేతి నాలుగు వేళ్లను తానే కట్ చేసుకున్న విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మయూర్ తారాపరా తన మోటోరోసైకిల్ పైన వెళ్తుండగా ఆక్సిడెంట్ అవడంతో సృహకోలిపోయాను అని తిరిగి మెలుకొని చూస్తే తన ఎడమ చేతికి ఉన్న నాలుగు వేళ్లు కట్ అయి ఉన్నాయి అని పేర్కొన్నాడు.
అయితే ఆ గాయాలని అతనే చేసుకున్నాడు అని విచారణలో తేలింది. తపర నబ్ జెమ్స్‌లో అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తన కుటుంబ సభ్యులకి ఆ పాని చేయడం ఇష్టం లేదు చెప్పే ధైర్యం లేక తన వేళ్లని తానే కతరించుకున్నాడు దానితోనైనా ఆ పనిని తనకి చెప్పారు అని భవిస్తూ. ఈ పనిచేశాడు అని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: America: అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు
Gujarat: డిసెంబర్ 8న అమ్రోలి రింగ్ రోడ్డులో తారాపరా తన చేతి వేళ్లను కత్తితో కోసుకుని, రక్త ప్రసరణ జరగకుండా చేతికి తాడుతో గట్టిగా కట్టుకున్నాడు. కత్తిని, వేళ్లను వేరు వేరు బ్యాగుల్లో పెట్టి పారేశాడు. తరువాత అతను తన స్నేహితులకు తనపై దాడి జరిగింది అని తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు.
పోలీసులు ముందుగా ఈ సంఘటనకు చేతబడికి సంబంధం ఉంది అని అనుమానించారు. కానీ CCTV ఫుటేజీ చూసిన తర్వాత నిజాలు బయటికి వచ్చాయి. తెగిపడిన నాలుగు వేళ్లలో మూడింటిని కత్తితో సహా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన పైన కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.