Gujarat: గుజరాత్‌లో నది వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య గురువారం నాటికి 13కు చేరింది. ఆ రాష్ట్రంలోని వడోదర జిల్లా కేంద్రానికి సమీపంలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర అనే వంతెన నిన్న (జూన్ 9) కూలింది. ఈ ప్రమాదంలో రెండు లారీలు సహా మరికొన్ని వాహనాలు నదిలో పడిపోయాయి. ఘటన జరిగిన వెంటనే అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Gujarat: 900 మీటర్ల పొడవు ఉన్న ఈ వంతనలోని రెండు పిల్లర్ల మధ్య ఉన్న స్లాబు ఒక్కసారిగా కుప్పకూలి నదిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు ఒకరు చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు, రెండు వ్యాన్లు, ఓ ఆటో రిక్షా, మరో బైక్ నీటిలో పడిపోయినట్టు వారు చెప్పారు. అప్పుడే వచ్చిన ఓ భారీ ట్యాంకర్, మరో వాహనం స్లాబు చివరిన వేలాడుతూ ప్రమాదకరంగా నిలిచి ఉన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా, మరో 9 మందికి గాయాలయ్యాయి.
Gujarat: 1985లో ప్రారంభమైన ఈ గంభీర్ బ్రిడ్జికి వానకాలం వచ్చినా ఎలాంటి మరమ్మతులు చేపట్టిన కారణంగా శిథిలమైన చోట కూలిందని గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. గతంలో అదే రాష్ట్రంలోని మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనలో 141 మంది మరణించారు. 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 14 వంతెనలు ఆ రాష్ట్రంలో కుప్పకూలాయని సమాచారం.