KTR: గుజరాత్‌లో వంతెన కూలిన ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది. మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. వడోదర, ఆనంద్ జిల్లాలను కలిపే ఈ వంతెనపై అపుడు అనేక మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో వాహనాలు నేరుగా నదిలోకి పడిపోయాయి.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి. సహాయక బృందాలు మిగిలిన వారికోసం వెతుకుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్రేన్లు, బోట్ల సాయంతో నదిలో పడిన వాహనాలను వెలికితీయడం కొనసాగుతోంది.
ఈ ఘటనతో వడోదర, ఆనంద్, భారూచ్, అంకాళేశ్వర్ వంటి ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాకాలం మొదలైన వెంటనే వంతెన కూలిపోవడం అధికారులు ఎంత అలసత్వంగా ఉన్నారో స్పష్టంగా చూపిస్తుంది. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన వంతెన ఇంత తేలికగా కూలిపోవడం స్థానికుల ఆగ్రహానికి దారి తీసింది.
ఇది కూడా చదవండి: Gujarat: గుజరాత్‌లో నదిలో కూలిన బ్రిడ్జి.. నదిలో పడిన వాహనాలు
ఇక ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న గుజరాత్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మొన్న మోర్బీ వంతెన కూలి 140 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు గంభీర వంతెన కూడా కూలిపోయింది. ఇది డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ గుజరాత్ మోడల్‌కి మరో ఉదాహరణ. ఇలాంటి ఘటనలపై ఎన్డీఎస్‌ఏ వంటి సంస్థలు విచారణ చేయాలి’’ అంటూ ఎక్స్ (పూర్వం ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.
ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజల్లో ఆందోళన
ఇటీవల గుజరాత్‌లో వరుస వంతెనలు కూలిపోతుండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. అధికారులు మాత్రం ప్రమాదం జరిగాకే చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం ఆచితూచి పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Another day and another glorious example of the Double Engine Gujarath model
A Final Destination re-creation. One second you are on the bridge and the next in the river
After Morbi bridge collapse where 140 plus people died, this is another shocker.
I am sure NDSA or other… pic.twitter.com/60bNnTFB8C
— KTR (@KTRBRS) July 9, 2025