Telangana:టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌లో అభ్యర్థులు నిరసన తెలిపారు. కార్యాలయ మెట్లపై నిల్చొని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. తుది ఫలితాల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మూడు నెలలపాటు సుధీర్ఘంగా నిర్వహించారని, అది పూర్తయి రెండు నెలలు దాటినా ఎందుకు ఫలితాలను విడుదల చేయడం లేదని నినదించారు.
