Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపికబురు అందించింది. ఉద్యోగుల సెలవుల విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందిన శుభవార్త లాంటిదే అన్నమాట. ఏడాదికి 30 సెలవులు ఇవ్వనున్నట్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తాజాగా రాజ్యసభలో కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారు.
Govt Employees:కేంద్రప్రభుత్వ ఉద్యోగులు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు ఏడాదికి 30 సెలవులు ఇవ్వనున్నట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ సెలవుల్లో 20 సెలవులు సగం వేతనంతో కూడిన సెలువులు అని, 8 క్యాజువల్ లీవ్స్ అని, 2 రెస్ట్రిక్టెడ్ సెలవులుగా ఇ్వనున్నట్టు మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఇతర వ్యక్తిగత కారణాల కోసం కూడా ఈ సెలవులను వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు.