Telangana Governer: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చారు. ఆయనకు రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి, కలెక్టర్ తేజావత్ నందాలాల్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తొలుత పరిశీలించారు. ఆయన పర్యటన ఇంకా కొనసాగుతున్నది.
