Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌టాపిక్‌లతో సజావుగా కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ బిల్లులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వివాదం, ప్రతిపక్ష ధోరణి వంటి అంశాలు ఈరోజు సభను హైటెన్షన్‌కు గురి చేయనున్నాయి.
సభలో లోపల, వెలుపల భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే పంచాయతీ రాజ్, పురపాలక చట్ట సవరణలు సభలో చర్చకు రానున్నాయి. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదికపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, నిధుల వినియోగం, సాంకేతిక సమస్యలపై నివేదికలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపనున్నాయి.
ప్రతిపక్షం ధోరణిపై కఠిన నిర్ణయాలు
సభలో ప్రతిపక్ష సభ్యులు మళ్లీ వాకౌట్ లేదా నిరసనలు వ్యక్తం చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేస్తే సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.
ఇది కూడా చదవండి: Janasena Trishul Vyuham: జన‘సేన’ కోసం పవన్ గట్టి ప్లాన్.. దసరా నుంచి త్రిశూల వ్యూహం
కాళేశ్వరం కమిషన్ నివేదిక – CBI లేదా SIT?
రాజకీయంగా ఆసక్తికరంగా మారిన అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ. ఈ నివేదికను సీబీఐకి అప్పగించాలా లేక రాష్ట్ర SIT ద్వారా విచారణ జరిపించాలా అన్నది ఈరోజు తేలనుంది. ఇద్దరు కీలక మంత్రులు సీబీఐ విచారణకు అనుకూలంగా ఉన్నారని సమాచారం.
సభలో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు:
-
2025, తెలంగాణ పురపాలక సంఘాల (మూడవ సవరణ) బిల్లు
-
2025, తెలంగాణ పంచాయితీరాజ్ (మూడవ సవరణ) బిల్లు
-
2025, తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల (రిజిస్ట్రికరణ, క్రమబద్ధీకరణ) చట్టం రద్దు బిల్లు
ఈ బిల్లులు రాష్ట్ర పాలనలో పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు వైద్య సంస్థల నియంత్రణ చట్టం రద్దుపై ప్రతిపక్షం నుంచి గట్టి చర్చ, విమర్శలు ఎదురుకావచ్చు.
రాజకీయ ఉత్కంఠ పెంచుతున్న అసెంబ్లీ
సభ రెండో రోజు చర్చలు మరింత హైటెన్షన్ సృష్టించేలా కనిపిస్తున్నాయి. కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం, ప్రతిపక్ష వైఖరి, బిల్లుల ఆమోదం – ఇవన్నీ తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనున్నాయి.