శృంగవరపుకోట మండలం భర్తాపురం సమీపంలోని ఓ గ్రామంలో పంటపొలంలో సంచరిస్తూ భారీ గిరి నాగు తన ఎరను వెతుక్కుంటోంది. దాని ఆకలిని గుర్తించినట్లు ఇంతలో ఏదో ఒక ప్రాణి దానికి చిక్కింది. ఆ ఎరను మింగుతూ ఉన్న కింగ్ కోబ్రాను అదే సమయంలో అక్కడ ఉన్న జనాలు చూసి భయపడ్డారు. అంతేకాదు కింగ్ కోబ్రాను బెదిరించడానికి జనం పెద్ద పెద్ద శబ్ధాలు చేశారు.
