Union Cabinet: రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తసంవత్సరం మొదటి రోజీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఎరువులపై సబ్సిడీ కొనసాగుతుంది. 50 కేజీల డీఏపీ ఎరువుల బస్తా మునుపటిలా రూ.1350కి అందుబాటులో ఉంటుంది.
డీఏపీ ఎరువులను తయారు చేసే కంపెనీలకు రూ.3850 కోట్ల అదనపు సబ్సిడీని కూడా కేబినెట్ ప్రకటించింది. ఫసల్ బీమా పథకానికి కేటాయింపులను రూ.69516 కోట్లకు పెంచారు. పంట బీమా చెల్లించనందుకు ఎలాంటి జరిమానా విధించరు.
ఇది కాకుండా, వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, సాంకేతికతను విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం 824.77 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కూడా కేటాయించింది.
ఇది కూడా చదవండి: Predictions For 2025: ఈ ఏడాది అంతా బీభత్సమే! నమ్మాల్సిందే.. కరోనా వస్తుందని ముందే చెప్పిన వ్యక్తి చెబుతున్నాడు కాబట్టి!
Union Cabinet: వాతావరణ సమాచారం, నెట్‌వర్క్ డేటా సిస్టమ్‌పై కూడా పని జరుగుతుంది. వాతావరణ సమాచారానికి సంబంధించిన ప్రాజెక్ట్‌లను కూడా క్యాబినెట్ ఆమోదించింది. వాతావరణ సమాచారం, నెట్‌వర్క్ డేటా సిస్టమ్ (WINDS)లో బ్లాక్ స్థాయిలో ఆటోమేటిక్ వెదర్ సిస్టమ్ (AWS) పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ARG) ఏర్పాటు చేస్తారు.
9 ప్రధాన రాష్ట్రాలు WINDS అమలు ప్రక్రియలో ఉన్నాయి. వీటిలో కేరళ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అస్సాం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్ మరియు రాజస్థాన్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయి.