Doctor Praneetha: గొడవలు, భర్తతో గొడవ, అత్తా మామలతో గొడవ. ఎంత చెప్పినా..తప్పంతా అతనిదే అనేలా వేలెత్తి చూపిస్తే..ఎన్ని సార్లని ఓపిక పట్టాలి. ఇక చాలు ..నాకు నువ్వు వద్దు ..అనుకుంది. విడాకులు ఇచ్చేయు అని అడిగింది. కానీ…విడాకుల మాట తర్వాత సంగతి..ఇప్పుడు ఆమె చనిపోయే పురిటి వచ్చింది. డాక్టర్ గా ..ధైర్యంగా బ్రతకాల్సిన ఆమెకు ఈ రోజు పరిస్థితి రావడానికి రీజన్ వారేనా ?
అత్తమామల వేధింపులు భరించలేక ఓ డాక్టర్ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఇప్పటికే డాక్టర్ కేసు కోర్టులో వుంది.అయినా అత్తమామల వేధింపులు, గొడవల కారణంగా ఫెర్నాండేజ్ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రణీతరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇది కూడా చదవండి: Narendra Modi: హర్యానా ప్రజలు మోడీకి విషం పెట్టి చంపేస్తారా?
2018లో టెక్కీ సికిందర్ రెడ్డితో ఆమె వివాహం జరిగింది. వీరికి నాలుగున్నరేళ్ల పాప వుంది. దంపతుల మధ్య గొడవల కారణంగా ఇప్పటికే విడాకుల కేసు నడుస్తోంది. సికిందర్‌తో ప్రస్తుతం ఆమె కలిసి వుండట్లేదు. దీంతో అత్తమామలు ఆమెను వేధించడం మొదలెట్టారు. ఒకే ఇంట్లో పై అంతస్థులో అత్తమామలు, కింది పోర్షన్‌లో కుమార్తె, ప్రణీత, ఆమె తల్లి వుంటున్నారు. అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మరలా గొడవ జరగగా ప్రణీత సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రణీత సెల్ఫీ వీడియో తీసుకుని మాత్రలు మింగేసింది.
ఆమె చంపాపేటలోని జీవన్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ ప్రణీతరెడ్డి ఆత్మహత్యాయత్నానికి నిరసనగా బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.