Gorre puranam : ఓటీటీలో గొర్రె పురాణం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

జంతువే ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా గొర్రె పురాణం. బాబీ దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా గత నెల 20న థియేట్రికల్ గా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అనుకున్నంతగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్నది. ఈ నేపథ్యంలో స్ట్రీమింగ్ తేదీలను ప్రకటించారు. ఈ నెల6న ఓటీటీలో రావచ్చనే టాక్ ఉంది.

ఒక వేళ ఆ తేదీ మిస్సయితే 11న స్ట్రీమింగ్ కావడం పక్కా అనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ పేరుకు తగినట్లే ఓ గొర్రె చుట్టే తిరుగుతుంది. ఆ గొర్రె రెండు మతాల మధ్య ఎలా చిచ్చుపెట్టిందన్నది సినిమా ట్రైలర్ లోనే మేకర్స్ చూపించారు. ఓ ముస్లిం వ్యక్తి ఇంట్లో బక్రీద్ విందుగా మారాల్సిన ఓ గొర్రె అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లి ఓ గుడిలోకి వెళ్తుంది.

దీంతో ఆ గొర్రె తమదని, దానిని తామే బలిస్తామని హిందువులు కొట్లాటకు దిగుతారు. ఈ గొర్రె కోసం రెండు వర్గాల మధ్య గొడవలు ఎక్కడికి దారి తీశాయి? చివరికి ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది సినిమాలో చూడాలి. ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్‌రెడ్డి గొర్రె పురాణం సినిమాను నిర్మించారు. పవన్ సి.హెచ్ స్వరాలు సమకూర్చారు. గొర్రె పురాణం టైటిల్‌ కు తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *