Gorantla Madhav Arrest

Gorantla Madhav Arrest: గోరంట్ల అంతగా రెచ్చిపోయింది ఇందుకా..!!

Gorantla Madhav Arrest: అయ్యిందా? బాగా అయ్యిందా? వైసీపీలో అదో టైపు పొలిటీషియన్‌ గోరంట్ల మాధవ్‌ ఫేస్‌ చేస్తున్న సిచ్యుయేషన్‌ చూస్తున్న వాళ్లంతా ఇప్పుడు సోషల్‌మీడియాలో ఇదే టైపు కామెంట్లు పెడుతున్నారు. ఎగేసుకుని వెళ్తే.. ఎత్తేశారంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. అలా గోరంట్ల సీరియస్‌గా చేసిన పొలిటికల్‌ హైడ్రామా కాస్తా… ఊహించని విధంగా కామెడీ స్కిట్‌లా మారిపోయింది. జైలు కెళ్లాలంటే ఆయనపై ఎన్నో కేసులున్నాయి. కానీ.. మరో కేసు సీటుకు తగిలించుకుని మరీ ఆయనే రిమాండ్‌కి వెళ్లిపోయారు. ఇంతకీ గోరంట్ల మాధవ్‌ ఏం ప్లాన్‌ చేశారు? చివరికి ఏం జరిగింది? ఇంతకీ ఇంత రచ్చా చేసింది దేనికి? తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా. హ్యావ్‌ ఎ లుక్‌.

గోరంట్ల హైడ్రామా వెనుక అసలు మేటర్‌ రాప్తాడు ఎమ్మెల్యే టిక్కెట్టేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మొన్న జగన్‌.. రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ సానుభూతిపరుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు నియోజకవర్గానికి వచ్చారు. ఆ రోజంతా ఎంత హైడ్రామా నడిచిందో మళ్లీ చెప్పక్కర్లేదు. హెలీప్యాడ్‌ వద్ద వైసీపీ కార్యకర్తల రచ్చ దగ్గర నుండి, లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన జగన్ పోలీసులపై బట్టలూడదీస్తానంటూ విరుచుకుపడటం, జగన్‌కి సరైన పోలీసు బందోబస్తు లేదంటూ వైసీపీ నేతలు చేసిన రాద్ధాంతం.. మొత్తానికి పరామర్శకు వచ్చి బిగ్గెస్ట్‌ పొలిటికల్‌ హైడ్రామా క్రియేట్‌ చేయడంలో వైసీపీ సక్సెస్‌ అయ్యింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: దళపతి ఒంటరి పోరు..ట్విస్ట్‌ ఎవరికో?

దాంతో ఆ క్రెడిట్‌ రాప్తాడు వైసీపీ ఇంచార్జ్‌ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఖాతాలో పడింది. ఆస్తి తగాదాలతోనో, కుటుంబ విభేదాలతోనో, వ్యక్తిగత కక్షలతోనో లింగమయ్య హత్య జరిగితే… దాన్ని రాజకీయం చేసి, జగన్‌ని రప్పించి, అంతకు ముందే ఎంపీపీ ఎన్నికల్లో తొడగొట్టి, మీసం మెలేసి, పోలీసులతో దూకుడుగా ప్రవర్తించి, రాజారెడ్డి రాజ్యాంగం కమింగ్‌ సూన్‌ అంటూ పోస్టర్లు ప్రదర్శించి… మొత్తానికి రాప్తాడులో పొలిటికల్‌ హీట్‌ పెంచేసిన తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి రాజకీయంతో ఆయనకు కావాల్సినంత హైప్‌ వచ్చేసింది.

ఇక తన వీరత్వానికి ఎలివేషన్లు జోడించి సోషల్‌మీడియాలోనూ వైపరీత్యంగా ప్రచారం చేసుకోవడంతో మరింత మైలేజ్‌ తెచ్చుకున్నారు తోపుదుర్తి. గోరంట్ల మాత్రం పది, పదిహేను రోజులుగా ఏమీ చేయలేక, తోపుదుర్తి రాజకీయానికి ప్రేక్షకుడిలా మిగిలిపోయారు. ఈ అక్కసునే ఆవేశంగా మార్చుకున్న గోరంట్ల మాధవ్‌… ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌ చేబ్రోలు వైఎస్‌ భారతి రెడ్డిపై చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యల్ని రాజకీయంగా క్యాష్‌ చేసుకునే పని మొదలుపెట్టారు. వెంటనే రంగంలోకి దిగిపోయి లోకేష్‌ని దారుణంగా తిట్టేసి, రాప్తాడు నుండి మంగళగిరికి వచ్చేసి, పోలీసుల వాహనాలకే అడ్డుపడి, ఎంత రచ్చ చేయాలో అంతా చేసేశారు. దీంతో జగన్‌ దగ్గర మంచి మార్కులు పడతాయ్‌ అనుకుంటున్న సమయంలోనే గోరంట్ల విధి వికటించి అరెస్ట్‌ అయ్యి, రెండు వారాలు రిమాండ్‌పై జైలుకెళ్లాల్సి వచ్చింది.

గోరంట్ల చేసిన ఈ మొత్తం రచ్చకి కారణం.. కేవలం రాప్తాడు ఎమ్మెల్యే టికెట్‌ మాత్రమే. నియోజకవర్గంలో తోపుదుర్తి బ్రదర్స్‌పై ఆధిపత్యం కోసమే గోరంట్ల ఇంత రచ్చ చేసి చేసి జైలుకెళ్లారంటే.. నమ్మసక్యంగా లేకున్నా.. ఇదే వాస్తవం. కాలం కలిసొచ్చి ఏదో ఓ టెర్మ్‌ ఎంపీగా పదవి వెలగబెట్టిన గోరంట్ల, ఇప్పుడు జగన్‌ మాదిరిగానే ఏ పదవీ లేకుండా ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. తను వేసిన దిగంబర వేషాల కారణంగా గత ఎన్నికల్లో టిక్కెట్‌ రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా సరే ఎమ్మెల్యే టికెట్‌ కన్ఫామ్‌ చేసుకోవాలన్న కసి గోరంట్లను ఒక్క పట్టాన ఉండనీయడం లేదు. రాప్తాడులో తన స్థానం పదిలం చేసుకోవాలన్న ఆత్రుత, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై ఆధిపత్యం కోసం ఆరాటం.. మొత్తానికి రాజకీయం గోరంట్ల మాధవ్‌ని పిచ్చోడిని చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *