Crime News: భర్త లేని మహిళే టార్గెట్.. ముందు అత్యాచారం, తర్వాత బ్లాక్ మెయిల్ చేసిన నిందితులు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళను ట్రాప్ చేసి, ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి గ్యాంగ్ రేప్ చెయ్యడమే కాకుండా.. నగ్న వీడియోలు తీసి ఆమెని బ్లాక్ మెయిల్ చేసిన దుండగులు.
ట్రాప్ ఎలా చేశారంటే..?
భర్త చనిపోయిన తర్వాత జీవనోపాధి కోసం దగ్గరలో ఉన్న బిస్కెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆమెకు కమలేష్ పరిచయం అయ్యాడు. కొంత కాలం తర్వాత ఆమెతో.. తక్కువ జీతంతో ఇక్కడే ఉండేబదులు, తనకి తెలిసిన ఓ హోటల్ లో మంచి జీతానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హోటల్ ఓనర్ జితేంద్రకు పరిచయం చేశాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, ఆమెతో సహజీవనం చేస్తూ ఆమెపైన ప్రతిరోజు లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ సమయంలో ఆమెకి తెలియకుండా వీడియోలు తీశాడు. అవి ఆమెకి చూపించి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడు.
స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్..!
ఆ వీడియోలు చూపించి హోటల్ ఓనర్ జితేంద్ర, కమలేష్ తో పాటు ఆమెపైన అత్యాచారం చేశారు. అక్కడే ఉంటే మళ్ళీ మళ్ళీ అత్యాచారం చేస్తారని నిందితుల నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి జితేంద్ర, కమలేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
