Gopichand

Gopichand: గోపీచంద్ కొత్త సినిమా షురూ… యాక్షన్ హీరో బ్యాక్ టు ఫామ్!

Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్ తన లాస్ట్ మూవీ ‘విశ్వం’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా, ఆగకుండా కొత్త ప్రాజెక్టులతో స్పీడ్ పెంచాడు. ఇప్పటికే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన గోపీచంద్, ఇప్పుడు మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు కుమార్ వెల్లంకి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా, నేడు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ స్వీకరించారు. గోపీచంద్ మార్క్ యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు డిఫరెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మిగతా తారాగణం, సాంకేతిక వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

‘విశ్వం’ నిరాశతో ఉన్న ఫ్యాన్స్‌కు ఈ కొత్త ప్రాజెక్ట్ గట్టి కిక్ ఇవ్వనుంది. గోపీచంద్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద గట్టిగా రీబౌండ్ అవుతాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి, ఈ యాక్షన్ హీరో ఈసారి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *