Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భారీ విరాళాలు అందుతున్నాయి. తాజాగా గూగుల్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న తోట చంద్రశేఖర్ కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు. టీటీడీకి చెందిన ఎస్‌వీ ప్రాణదాన ట్రస్టుకు ఆయన ఈ విరాళాన్ని అందించారు.
ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ తిరుమలలోని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి చెక్కును అందజేశారు. ట్రస్టు సేవల పట్ల తమ మద్దతుగా ఈ విరాళం ఇచ్చినందుకు టీటీడీ అధికారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తిరుమలలోని చైర్మన్ కార్యాలయంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Aashadam Bonalu 2025: నేటి నుండి ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభం..