Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్. జైలర్-2 టీజర్ రీ రిలీజ్ డేట్ లాక్ అయినట్టు సమాచారం. రజనీ పుట్టినరోజు డిసెంబర్ 12నే ఆ రోజున టీజర్ రావొచ్చని తమిళ సినీ వర్గాల్లో టాక్. సూపర్‌స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న జైలర్-2 పట్ల తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ పై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Also Read: Dragon: ‘డ్రాగన్’ ఎన్టీఆర్ ఎంట్రీకి భారీ సెట్?
ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ గురించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. మేకర్స్ డిసెంబర్ 12న టీజర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. అదేరోజు రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా భారీ ట్రీట్ ఇవ్వాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియోతోనే నెక్స్ట్ లెవెల్ హైప్ సృష్టించిన మేకర్స్.. టీజర్‌తో మరింత రచ్చ చేయనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలాంటి రేంజ్‌లో అలరిస్తుందో ఆసక్తికరంగా ఉంది.
