Google in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో కీలక మలుపు తిరగనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ త్వరలో ఇక్కడ అడుగు పెట్టనుందనే వార్తలు అధికారిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధులు అత్యున్నత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా నెక్కల్లు – అనంతవరం మధ్య ఉన్న ఈ-8 రోడ్డు పక్కన 143 ఎకరాల భూమిని పరిశీలించారు.
ఈ భూమి సర్వే నంబర్లు: 10, 12, 13, 15, 16. ఈ స్థలాన్ని గూగుల్‌కు కేటాయించేందుకు CRDA ముందుకువచ్చింది. ఈ ప్రాంతానికి సమీపంలో భవిష్యత్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో, భౌగోళికంగా ఇది అనువైన ప్రాంతంగా సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సమాచారం.
గత శుక్రవారం గూగుల్ ప్రతినిధులు – CRDA అధికారులతో కలిసి నెక్కల్లులో స్థల పరిశీలన జరిపారు. పరిశీలన అనంతరం వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Adi Neyyi Kadu: సిగ్గు వదిలేశారా? ఇలా కూడా సమర్థించుకుంటారా?
గూగుల్ ప్రాజెక్ట్ అమలవుతోంటే:
-
వెబ్ టెక్నాలజీ, డేటా సెంటర్ల స్థాపనకు దారి
-
ప్రాంతీయ ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి
-
పారిశ్రామికంగా అమరావతి పరిసరాల అభివృద్ధి వేగవంతం
-
గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి అమరావతిపై కేంద్రీకృతం
గతంలో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో భాగంగా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన విశ్వప్రయత్నాల ఫలితమే ఇది అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఐటీ రంగంలో వృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలక మలుపు కానుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇతర వివరాలు, అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడే అవకాశముంది.