Gold Rates Today: బంగారం అంటే అందరికీ ఎంతో ఆసక్తి. మహిళలు అనే కాదు పురుషుల్లోనూ బంగారంపై ఎంతో ఇష్టం ఉంటుంది. అందులోనూ మన దేశంలో బంగారం విషయంలో ఉండే ఆకర్షణ వేరే లెవెల్ లో ఉంటుంది. పండుగలు, పెళ్లిళ్లు.. ఏ శుభకార్యానికైనా కొద్దిపాటి బంగారం కొనాలని అందరూ తహతహ లాడతారు. అంతేకాదు బంగారం మంచి పెట్టుబడి సాధనంగా కూడా ఉంటుంది. కాస్త బంగారం కొనిపెట్టుకుంటే అవసరంలో ఆడుకుంటుంది అనే వారి నుంచి బంగారం కొని.. అమ్మడం వంటివి చేస్తూ దాని వ్యాపారంగా చూసేవారి వరకూ బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
Gold Rates Today: అయితే, బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మారిపోయే బంగారం ధరలను చెక్ చేసుకోవడం కూడా మనలో చాలామందికి ఇంట్రెస్టింగ్ విషయం బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా వచ్చే మార్పుల నుంచి.. స్థానికంగా ఉండే డిమాండ్.. టాక్స్ ల ఆధారంగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే మన దేశంలో ప్రాంతాలను బట్టి కూడా బంగారం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.
Gold Rates Today: అంతర్జాతీయంగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈరోజు అంటే 24.01.2025న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేస్తున్నాయి. అయితే, ఆ ప్రభావం మన దేశంలో బంగారం ధరలపై పడలేదు. నిన్న ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు దేశీయంగా ఈరోజు స్థిరంగా నిలిచాయి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. . ఈరోజు అంటే 24.01.2025న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు 75,250 రూపాయల వద్ద నిలకడగా ఉన్నాయి. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 82,090 రూపాయల వద్ద నిలిచింది.
ఇక హైదరాబాద్ లో వెండి విషయానికి వస్తే వరుసగా ఆరో రోజూ ఎటువంటి మార్పులు లేకుండా కేజీ 1,04,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold Rates Today: మన తెలుగురాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల విషయానికి వస్తే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా బంగారం, వెండి ధరలు కాస్త అటూ ఇటూగా ఇలానే ఉన్నాయి.
Gold Rates Today: అదేవిధంగా దేశరాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధరలు మార్పులు లేకుండా 75,400 రూపాయల వద్ద నిలిచాయి. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 82,240 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. అలాగే వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ఢిల్లీలో కూడా ఆరోరోజూ నిలకడగా ఉంది 96,500 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold Rates Today: అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధరలు స్వల్ప తగ్గుదల కనబరిచాయి. వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. ఈరోజు అంటే 24.01.2025 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర 76,630రూపాయలుగా ఉంది. అదేవిధంగా వెండి ధరలు వరుసగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి. కేజీ వెండి ధర 84,644రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన బంగారం ధరలు ఈరోజు అంటే 24.01.2025 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా వచ్చే మార్పులు, స్థానికంగా ఉండే డిమాండ్, స్థానిక పన్నులు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బంగారం, వెండి కొనాలని అనుకునేటప్పుడు మీ ప్రాంతంలో రెండు మూడు దుకాణాల్లో వెరిఫై చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మహాన్యూస్ సూచిస్తోంది.