Gold Rate Today: పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు అనుభవిస్తున్నప్పటికీ.. మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. 2025 జూన్ 5వ తేదీ (గురువారం) ఉదయం బులియన్ మార్కెట్‌లో నమోదైన తాజా ధరల ప్రకారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,180గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,910కు చేరుకుంది. అంతేకాదు, వెండి ధర కూడా కిలోకు రూ.1,02,100కు పెరిగింది.
ఒక్కోసారి తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగులు తీస్తున్న ధరలు మధ్య తరగతి ప్రజలకు కాస్త భారంగా మారుతున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే కుటుంబాలకు ఇది మళ్లీ ఆందోళన కలిగించే విషయం. అయితే మార్కెట్ నిపుణులు చెబుతున్నదేమిటంటే.. అంతర్జాతీయంగా డాలర్ విలువ, ఫెడరల్ రెజర్వ్ నిర్ణయాలు, యుద్ధ వాతావరణం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
Gold Rate Today: ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు (జూన్ 5, 2025):
నగరం | 24 క్యారెట్లు (10 గ్రా) | 22 క్యారెట్లు (10 గ్రా) | వెండి (1 కిలో) |
---|---|---|---|
హైదరాబాద్ | ₹99,180 | ₹90,910 | ₹1,13,100 |
విజయవాడ | ₹99,180 | ₹90,910 | ₹1,13,100 |
విశాఖపట్నం | ₹99,180 | ₹90,910 | ₹1,13,100 |
ఢిల్లీ | ₹99,330 | ₹91,060 | ₹1,02,100 |
ముంబై | ₹99,180 | ₹90,910 | ₹1,02,100 |
చెన్నై | ₹99,180 | ₹90,910 | ₹1,13,100 |
బెంగళూరు | ₹99,180 | ₹90,910 | ₹1,02,100 |
కోల్‌కతా | ₹99,300 | ₹91,000 | ₹1,02,300 |
పుణె | ₹99,250 | ₹90,950 | ₹1,02,100 |
జైపూర్ | ₹99,200 | ₹90,930 | ₹1,02,000 |
ఇది కూడా చదవండి: Bangalore Stadium Stampede: బెంగళూరులో జరిగిన తొక్కిసలాట కి ఎవరు బాధ్యులు? ఇవే 5 ప్రధాన కారణాలు.
గమనించవలసిన అంశాలు:
-
ధరలు రోజువారీ మారుతుంటాయి, కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యూవెల్లరీల వద్ద ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవాలి.
-
గ్రాముని ప్రకారం బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండవచ్చు.
-
వెండి ధరలు నగరాన్ని బట్టి ఎక్కువగా మారుతూ ఉంటాయి.
ఇలా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో, కొనుగోలుదారులు సరైన సమయాన్ని ఎంచుకుని మేలైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ధరలపై తాజా సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి.